ఓటింగ్.. ఇళ్ల మధ్య వైన్ షాపు పెట్టాలా..వద్దా..?

ఓటింగ్.. ఇళ్ల మధ్య వైన్ షాపు పెట్టాలా..వద్దా..?

హైదరాబాద్ : నివాసాల మధ్య వైన్ షాపు ఏర్పాటుపై వినూత్న రీతిలో నిర్ణయం తీసుకున్నారు అపార్ట్ మెంట్ వాసులు. ముషీరాబాద్ చౌరస్తాలోని జయదుర్గ, జయలక్ష్మి, జయప్రియ అపార్ట్ మెంట్ల లో ఉదయం నుంచి వేర్వేరుగా ఓటింగ్ పద్ధతి ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. దాదాపు 1000 మంది ఓటింగ్ లో పాల్గొని వైన్ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. నెలరోజులుగా నివాసాల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. అపార్ట్ మెంట్ పరిసరాల్లో దేవాలయం, హాస్పిటల్, కిరణా షాపులు ఉన్నాయని.. వైన్ షాపు ఏర్పాటు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేయకుండా న్యాయపోరాటం చేస్తామంటున్నారు అపార్ట్ మెంట్ వాసులు.