Health Tip : టీ, కాఫీ బాగా వేడిగా తాగకూడదా.. వేడి వేడిగా తాగితే క్యాన్సర్ వస్తుందా..!

Health Tip : టీ, కాఫీ బాగా వేడిగా తాగకూడదా.. వేడి వేడిగా తాగితే క్యాన్సర్ వస్తుందా..!

ఒక కప్పు చాయ్ చూడగానే కొందరిలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. ముఖ్యంగా పని ఉక్కిరి బిక్కిరిలో ఉన్నవాళ్లకి వేడి వేడి చాయ్ గొంతులో పడితే అదొక రిలీఫ్. అయితే, ఇలా వేడి వేడిగా తాగడం అస్సలు మంచిది కాదని.. ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.

గొంతు నుంచి పొట్ట దాకా ఆహారాన్ని చేర్చే గొట్టం వంటి భాగాన్ని ఈసోఫేగస్ (అన్నవాహిక) అంటారు. వేడివేడి కాఫీ, టీలు తాగడం వల్ల సున్నితంగా ఉండే ఆ గొంతునాళంపై ప్రభావం పడుతుంది. అది మంట, పుండ్లకు దారితీస్తుంది. ఇది ఎక్కువైతే ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం టీ, కాఫీలే కాదు.. వేడిగా ఉండే ఏ ద్రవాలైనా సరే ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెప్ప న్నారు. జర్నల్ ఆఫ్ క్యాన్సర్లో ఈ పరిశోధనకు సంబంధించిన ఆర్టికల్ ప్రచురితమైంది. 

ఈసోఫాగస్ క్యాన్సర్ లక్షణాలు

గొంతునొప్పి, గొంతు మంట బరువు తగ్గడం. గుండెలో మంట...

స్టడీ

కాఫీ, టీలు తాగుతున్న 40 నుంచి 75 మధ్య వయసున్న వాళ్లలో సుమారు 50వేలమందిపై ఈ పరిశోధన జరిగింది. ఇందులో దాదాపు 317 మందికి ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చింది. 'చాలామందికి ఉదయాన్నే ఎక్కువగా టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. అతిశీతల దేశాల్లో అయితే కొందరు వేడివేడి ఆల్కహాల్ని తీసుకుంటారు. అత్యంత వేడిగా ఉండే ఈ లిక్విడ్ వల్ల గొంతునాళానికి వేడి పుట్టి పుండ్లు అవుతాయి. ఇవి క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంది' అని అమెరికా క్యాన్సర్ సొసైటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. అలాగని హాట్ డ్రింక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సాధా రణంగా మనం తాగే కాఫీ, టీలు 70 నుంచి 80 డిగ్రీల వరకు వేడిగా ఉంటాయి. అలా తాగకుండా కాస్త చల్లారిన తర్వాత తాగడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

పరిశోధకులు, వేడి కాఫీ, టీలు ఎక్కువగా తాగడంతో పాటు... వారానికి 14 గ్లాసులకి మించి ఆల్కహాల్ తీసుకున్నా, ధూమపానం ఎక్కువైనా ఈ క్యాన్సర్ వస్తుంది. సంవత్సరానికి నాలుగు లక్షల మంది ఈసోఫేగస్ క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు.. వేసవి కాలంలో డీహైడ్రేషన్ సమస్య అధికంగా ఉంటుంది. చల్లని నీళ్లు ఎంత తాగినా గొంతు పొడిబారుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగడం వలన గొంతు పొడిబారకుండా ఉంటుంది.