కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ : అదరగొడుతున్న ఇండియన్‌‌‌‌ టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు

కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ : అదరగొడుతున్న ఇండియన్‌‌‌‌ టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌: కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ టీటీ ప్లేయర్లు అదరగొడుతున్నారు. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ.. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సెమీస్‌‌‌‌లోకి దూసుకెళ్లింది. ఆచంట శరత్‌‌‌‌ కమల్‌‌‌‌తో కలిసి బరిలోకి దిగిన శ్రీజ.. క్వార్టర్‌‌‌‌ఫైనల్లో 11–7, 8–11, 11–8, 11–13, 11–9తో పిచ్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ లియామ్‌‌‌‌–హో టిన్‌‌‌‌ టిన్‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌)పై గెలిచింది. మరో క్వార్టర్స్‌‌‌‌లో సత్యన్‌‌‌‌–మనికా బాత్రా 10–12, 11–9, 11–8, 7–11, 7–11తో చూంగ్‌‌‌‌ జీవెన్‌‌‌‌–ఎన్‌‌‌‌ కరీన్‌‌‌‌ (మలేసియా)పై గెలిచారు. అంతకుముందు జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో శ్రీజ 8–11, 11–7, 12–14, 9–11, 11–4, 15–13, 12–10తో చార్లెటీ కారీ (వేల్స్‌‌‌‌)పై గెలిచింది. మరో మ్యాచ్‌‌‌‌లో మనికా బాత్రా 4–11, 8–11, 6–11, 10–12తో మిన్‌‌‌‌యుంగ్‌‌‌‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. అయితే రీత్‌‌‌‌ టెన్నిసన్‌‌‌‌ 2–11, 4–11, 11–9, 3–11, 4–11తో తెన్ని ఫెంగ్‌‌‌‌ (సింగపూర్‌‌‌‌) చేతిలో ఓడింది. 

ఫైనల్లో భావినా పటేల్‌‌‌‌

పారా టీటీలో ఇండియాకు మెడల్‌‌‌‌ ఖాయమైంది. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్లాస్‌‌‌‌ 3–5 కేటగిరీలో భావినా పటేల్‌‌‌‌ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో కనీసం రజతమైన దక్కుతుంది. సెమీస్‌‌‌‌లో భావిన 11–6, 11–6, 11–6తో సు బెయిలీ (ఇంగ్లండ్‌‌‌‌)పై గెలిచింది. మరో మ్యాచ్‌‌‌‌లో సోనల్‌‌‌‌బెన్‌‌‌‌ పటేల్‌‌‌‌ 11–8, 6–11, 4–11, 7–11తో ఇక్పోయి చేతిలో ఓడింది. అయితే బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ పోరులో సోనల్‌‌‌‌బెన్‌‌‌‌... బెయిలీతో తలపడుతుంది.