బ్లాక్​ స్వాన్​లో శ్రేయ

బ్లాక్​ స్వాన్​లో శ్రేయ

‘బ్లాక్​స్వాన్​’.. ఇదొక​ కె–పాప్​  విమెన్​ బ్యాండ్​. ప్రపంచంలోనే టాప్​ పాప్​ బ్యాండ్స్​లో ఒకటి కూడా. వీళ్ల ఆల్బమ్స్​కి కోట్లల్లో అభిమానులున్నారు. ఇంతటి ప్రిస్టేజియస్​ బ్యాండ్​లో ఎంట్రీకి ఒడిశాకి చెందిన 18 ఏండ్ల శ్రేయ లెంక అడుగు దూరంలో ఉంది. బ్లాక్​ స్వాన్​లో స్థానం కోసం వివిధ దేశాలకు చెందిన నాలుగు వేలమంది ఆర్టిస్ట్​లని వెనక్కి నెట్టిందామె. తన డాన్సింగ్, సింగింగ్​తో పాటు గ్రేస్​ అప్పియరెన్స్​తో టాప్–2 వరకు దూసుకెళ్లింది. ఫైనల్​లో నెగ్గితే మొదటి ఇండియన్​–కె పాప్​ ఆర్టిస్ట్​గా శ్రేయ రికార్డు క్రియేట్​ చేసినట్టే. 

ఒడిశా నుంచి బ్లాక్​ స్వాన్​ వరకు శ్రేయ ఎలా చేరుకుందంటే.. డిఆర్​ మ్యూజిక్​ 2020లో ‘బ్లాక్ స్వాన్’​ అనే సౌత్​ కొరియన్​ గర్ల్​ గ్రూప్​ని ఇంట్రడ్యూస్​ చేసింది. ఐదుగురు పాప్​ గర్ల్స్​తో మొదలైన ఆ బ్యాండ్​ మొదటి ఆల్బమ్​ ‘గుడ్​ బాయ్​ రనీనా’ సూపర్​ హిట్​ అయింది. అప్పట్నించి ఈ బ్యాండ్​ని రనీనా, బిపి రనీనా అని కూడా పిలుస్తున్నారు. కానీ, 2020 నవంబర్​లో ఆ బ్యాండ్​ ఐదో మెంబర్​ హైమీని  దాన్నుంచి బయటికొచ్చింది. దాంతో ఆ పొజిషన్​ కోసం గ్లోబల్​గా ఆడిషన్స్​ కండెక్ట్​ చేసింది డిఆర్​ మ్యూజిక్. వరల్డ్​లోనే ది బెస్ట్​ పాప్​ బ్యాండ్​గా బ్లాక్​ స్వాన్​కి పేరుండటంతో దాదాపుగా 4000 మంది ఆర్టిస్ట్​లు ఆ ప్లేస్​ కోసం పోటీపడ్డారు. కానీ, వాళ్లందర్నీ దాటి  టాప్​–2 వరకు వెళ్లింది శ్రేయ. టాప్–1 కోసం బ్రెజిల్​కి చెందిన గాబ్రియేలా డాల్సిన్​తో పోటీ పడబోతుంది ఇప్పుడు. ‘‘ పద్దెనిమిదేండ్ల వయసులో ఇక్కడి వరకు రావడానికి మా నాన్న ఎంకరేజ్​మెంట్ చాలా ఉందంటుం’’ది శ్రేయ. 

కవర్​ సాంగ్స్​ చేసింది

ఒడిశాలోని రూర్కెలా శ్రేయ సొంతూరు. మధ్య తరగతి కుటుంబం. కానీ, ఉన్నంతలోనే కూతురి కలల్ని తీర్చడానికి ఆమె తండ్రి చాలా కష్టపడ్డాడు. శ్రేయ ఆటపాటల్లో యాక్టివ్​గా ఉండటం గమనించి ఎంకరేజ్​ చేశాడు. అలా తండ్రి సపోర్ట్​తో ఎనిమిదేండ్ల వయసు నుంచే డాన్స్​ ప్రాక్టీస్​ మొదలుపెట్టింది శ్రేయ. ఆ తర్వాతి సంవత్సరం నుంచే కాంపిటీషన్స్​లోనూ పార్టిసిపేట్​ చేసింది. బోలెడు ప్రైజ్​లు గెలుచుకుంది. మ్యూజిక్ కూడా నేర్చుకుంది. అయితే శ్రేయ వాయిస్​ ‘లో’ పిచ్​లో ఉండటంతో  మొదట్లో సరైన టీచర్​ దొరకడం కష్టమైంది ఆమెకి. వాళ్ల అమ్మమ్మ హిందూస్తానీ మ్యూజిక్​లో చేర్పించింది. దాంతో పాటు ఆన్​లైన్​లో  వీడియోలు చూస్తూ తన గొంతుని సరిచేసుకుంది శ్రేయ. యోగాలోనూ పర్ఫెక్ట్​ అయింది. పాప్​ విషయానికొస్తే చిన్నప్పట్నించీ కొరియన్​ పాప్​ ఆల్బమ్స్​ బాగా వింటుండేది. అలా తెలియకుండానే పాప్​వైపు తన మనసు మళ్లింది. అలా కొరియన్​ పాప్​ పాటలకి కవర్​ సాంగ్స్​ చేసింది. అలా ముందుకెళ్తున్న తన లైఫ్​ని పూర్తిగా మలుపు తిప్పింది ‘బ్లాక్​స్వాన్​​’ ఆడిషన్​ కాల్​.

మొదటి ఇండియన్​ కె–పాప్​గా...

2021 లో బ్లాక్​ స్వాన్​ ​ గ్లోబల్​ ఆడిషన్స్​ కండక్ట్​ చేస్తున్నట్టు యూట్యూబ్​లో అనౌన్స్​ చేసింది. వెంటనే తన అప్లికేషన్ పంపింది శ్రేయ. మొదటి రౌండ్​లో 3,977 మందిని వెనక్కి నెట్టింది. రెండో రౌండ్​లో​ ఎడిటింగ్ లేని సింగింగ్​, డాన్సింగ్​ వీడియోలు అడిగారు వాళ్లు. అవే తనని 23 మందిలో టాప్–2లో నిలబెట్టాయి. అంతలోనే ఫైనల్స్ కోసం నెలరోజుల ట్రైనింగ్​కి సియోల్​ రమ్మని శ్రేయకి పిలుపొచ్చింది. అంత చిన్న వయసులో శ్రేయని ఒంటరిగా పంపించాలా? వద్దా? అని ఆలోచనలో పడ్డారు పేరెంట్స్. శ్రేయ తల్లి వద్దంటే వద్దని మొండికేసింది. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో కూతురి కలని అర్థం చేసుకుని శ్రేయ తండ్రి సపోర్ట్​ చేశాడు. శ్రేయకి తోడుగా సియోల్​ వరకు తనూ వెళ్తున్నట్టు భార్యకి చెప్పాడు. కానీ, ఢిల్లీలో తనని విమానం ఎక్కించి, ఒకరోజు తర్వాత తిరిగి ఇంటికొచ్చాడు. అలా సియోల్​ చేరుకున్న శ్రేయ ప్రస్తుతం కాంపిటీషన్​ రూల్స్​ ప్రకారం ఫైనల్స్​ కోసం కొరియన్​ లాంగ్వేజ్​తో కుస్తీ పడుతోంది. అక్కడి కల్చర్, ఫ్యాషన్ ట్రెండ్స్​​, మేకప్​ గురించి మరింత తెలుసుకుంటోంది.