కిషన్, అయ్యర్ లపై కఠిన చర్యలు..బీసీసీఐపై అభిమానులు ఫైర్

కిషన్, అయ్యర్ లపై కఠిన చర్యలు..బీసీసీఐపై అభిమానులు ఫైర్

టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. 2024–25 కోసం బుధవారం ప్రకటించిన సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ ఇద్దర్ని తొలగించింది. నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేనప్పుడు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రంజీ ట్రోఫీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఈ ఇద్దరు పట్టించుకోకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంది. అయితే ఏదైనా సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసే క్రమంలో ఈ ఇద్దర్ని పరిగణనలోకి తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఈ ఇద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ లో భాగం కానీ నిర్ణయాన్ని కొంతమంది సమర్దిస్తుంటే మరి కొందరూ విమర్శిస్తున్నారు. కొంతమంది వర్గం మాత్రం బీసీసీఐపై మండిపడుతుంది. ఒక్క రంజీ ట్రోఫీ ఆడనందుకు పక్కన పెడతారా అని ఒక నెటిజన్ అంటుంటే.. వరల్డ్ కప్ జట్టులో ఉన్న ఇద్దరు ప్లేయర్లపై ఇంత కట్టిన నిర్ణయం అవసరమా అని మరొకరు అన్నారు. కిషాన్ అయ్యర్ లతో మీ సమస్య ఏంటి ఇంకొకరు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ తప్పితే బీసీసీఐ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.   

మొత్తం 30 మందికి నాలుగు రకాల కేటగిరీలలో బీసీసీఐ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించగా, కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కోలుకుంటున్న వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. రంజీ ట్రోఫీలో చెలరేగుతున్న చతేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుజారా, అజింక్య రహానెను బోర్డు పట్టించుకోలేదు.