
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్ ( Shruti Haasan ). నటనలోనే కాదు సింగర్ గా కూడా రాణిస్తోంది. ఈ బ్యూటీ వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో బోల్డ్‌గా ఉంటారు. మన వ్యక్తిగత విషయాల గురించి తన మనసులో మాట చెప్పడానికి ఆమె ఎప్పుడూ వెనుకాడరు. తన ప్రేమ, బ్రేకప్ ఇలా ఏ విషయంలోనైనా నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ఇటీవల ఒక ఛాట్‌లో, శ్రుతి హాసన్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె పెళ్లి అనే ఆలోచనకే భయపడుతున్నానని, అందుకే జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.
పెళ్లి అంటే భయం...
"పెళ్లి అనే ఆలోచన అంటే నాకు చాలా భయం," అని శ్రుతి హాసన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. నమ్మకం, నిబద్ధత వంటి వాటిని తాను బలంగా నమ్ముతానని, అయితే "ఒక కాగితం ముక్క"తో వాటన్నిటినీ బంధించే ఆలోచన తనకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, అది నాకు అసలు నచ్చదని ఆమె వివరించారు. తనకంటూ ఒక గుర్తింపును, స్వాతంత్య్రాన్ని కష్టపడి సాధించుకున్నానని, అలాంటిది సాంప్రదాయబద్ధమైన పెళ్లి ఆలోచన తనకు "నిజంగా భయంకరంగా" అనిపిస్తుందని ఆమె అన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఆచారాలను, సెంటిమెంట్‌లను తాను గౌరవించినప్పటికీ, వ్యక్తిగతంగా పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు.
అమ్మగా మారాలని ఆశ
శ్రుతి హాసన్ ఒకసారి పెళ్లికి చాలా దగ్గరగా వచ్చానని కూడా పంచుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య అనుకూలత లేకపోవడం వల్ల ఆ సంబంధం వర్కౌట్ కాలేదని ఆమె చెప్పారు. "అది నా తప్పు కాదు. కేవలం అనుకూలత లేకపోవడమే," ఆమె వివరించారు. పెళ్లి అనేది పిల్లలకు, భవిష్యత్తుకు సంబంధించిన చాలా పెద్ద నిర్ణయమని, దానికి చాలా బాధ్యత ఉంటుందని ఆమె అంగీకరించారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తనకు ఎప్పుడూ తల్లి కావాలని ఉందని శ్రుతి హాసన్ ఒప్పుకున్నారు. అయితే, ఒక బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరూ ఉండటం అవసరమని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే దత్తత తీసుకోవడం కూడా ఒక అవకాశమేనని ఆమె అన్నారు. పిల్లలు "అద్భుతంగా" ఉంటారని శ్రుతి హాసన్ వారిపై తన ప్రేమను వ్యక్తపరిచారు.
తనలో తాను జీవిస్తూ, ప్రేమించుకుంటూ!
గత సంవత్సరం బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో విడిపోయిన తర్వాత, శ్రుతి హాసన్ ప్రస్తుతం తనను తాను ప్రేమించుకోవడంపైనే దృష్టి సారించారు. "నేను ఇప్పుడు ఒంటరితనాన్ని అలవరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, దీన్ని లోన్లీనెస్ అని పిలవడం లేదు," అని ఆమె తెలిపారు. లోన్లీనెస్ నుంచి తప్పించుకోవడానికి ఒక బంధంలోకి దూసుకెళ్లడానికి బదులుగా, శ్రుతి తన ఒంటరితనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, ముందు తనను తాను పూర్తిగా ప్రేమించుకోవడానికి సమయం తీసుకుంటున్నారు. ఆ తర్వాతే తన జీవితంలోకి ఇంకెవరినైనా అనుమతించాలని ఆమె నిర్ణయించుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) హీరోగా నటించిన 'కూలీ' ( Coolie )లో శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ( Nagarjuna ) , సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే వంటి ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగగా 'కూలీ' సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. .