
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతీహాసన్.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాతో పాటు ప్రభాస్‌కి జంటగా ‘సాలార్’ మూవీలో నటిస్తున్న ఆమె.. తాజాగా మెగాస్టార్ మూవీలోనూ హీరోయిన్‌గా సెలెక్టయ్యింది. చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో హీరోయిన్‌గా చాలామందిని పరిశీలించిన టీమ్, చివరికి శ్రుతిని ఫైనల్ చేశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆ విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమాలోకి శ్రుతికి వెల్‌కమ్ చెబుతూ చిరంజీవితో పాటు దర్శకుడు బాబి కూడా ట్వీట్ చేశాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకి జంటగా నటించిన శ్రుతి.. ఇప్పుడు మెగాస్టార్‌తోనూ కలిసి నటించడం విశేషం.