ఇంటర్ బోర్డు సెక్రటరీగా శృతి ఓజా బాధ్యతలు

ఇంటర్ బోర్డు సెక్రటరీగా శృతి ఓజా బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు సెక్రటరీగా శృతి ఓజా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్​గా పనిచేసిన ఆమె.. ఇటీవల ఇంటర్ బోర్డుకు బదిలీ అయ్యారు. ఆమె తొలిరోజు ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన శృతి ఓజాను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో టీజేఎల్​ఏ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.