Cricket World Cup 2023: గిల్ వచ్చేస్తున్నాడు: పాక్‌తో మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు పయనం

Cricket World Cup 2023: గిల్ వచ్చేస్తున్నాడు: పాక్‌తో మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌కు పయనం

భారత్-పాకిస్థాన్ మ్యాచుకు ముందు టీమిండియాకు అదిరిపోయే శుభవార్త అందింది. స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ పాకిస్థాన్ తో జరిగే మ్యాచుకు అందుబాటులో దాదాపుగా ఖరారైంది. గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో వరల్డ్ కప్ తొలి మ్యాచులకు దూరమైన గిల్ తాజాగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. తన చికిత్స కోసం చెన్నైలోనే ఉండిపోయిన గిల్.. ఈ రోజు  అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ గిల్ రెస్ట్ తీసుకోవడంతో పాటు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడని సమాచారం. 

గిల్ ప్లేట్‌లెట్ కౌంట్ లక్ష కంటే తక్కువగా పడిపోవడంతో ఆదివారం రాత్రి చెన్నైలోని మల్టీ-కేర్ స్పెషాలిటీ ఆసుపత్రి 'కావేరి'లో చేరాల్సి వచ్చింది. ఇది దాదాపు 70000 అని నివేదించబడింది. డెంగ్యూ చికిత్స నిబంధనల ప్రకారం.. ప్లేట్‌లెట్ కౌంట్ లక్ష కంటే తక్కువగా ఉంటే రోగిని ఆసుపత్రికి తరలిస్తారు. అయితే, అతని పరిస్థితి మెరుగుపడటంతో గిల్ సోమవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యాడు. గిల్ ప్లేట్‌లెట్ కౌంట్ కూడా పెరిగింది.

Also Read :- 100 కోట్ల మంది టార్గెట్ : ఇండియా - పాక్ మ్యాచ్ కు అతిరథమహారథులు

పాకిస్థాన్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్ కోసం గిల్ అందుబాటులో ఉండడం ఇపుడు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అహ్మదాబాద్ పిచ్ పై గిల్ కి అద్భుతమైన రికార్డ్  అక్టోబర్ 14 న ఈ మ్యాచ్ జరగనుండగా.. నేడు భారత్ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో పోరుకు సిద్ధమవుతుంది.