
టీంఇండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మెన్ గ్రెగ్ చాపెల్. లార్డ్స్ టెస్ట్ ల టీంఇండియా ఓటమికి గిల్ పేలవమైన కెప్టెన్సీ కారణమని అన్నారు. జడేజా లాంటి బ్యాట్స్ మెన్ ని టెయిల్ఎండ్ లో పంపుతున్నప్పుడు మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఆడాలని గిల్ నేరుగా చెప్పుండాల్సిందని అన్నారు చాపెల్. లార్డ్స్ టెస్ట్ లాంటి సందర్భంలో జడేజా లాంటి బ్యాట్స్ మెన్ ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు సింగిల్స్ కి వెళ్లడం సరైన ఛాయస్ కాదని.. వీలైనన్ని బాల్స్ ని బౌండరీకి చేర్చి టీం గెలిపించేలా ఆడాలని అన్నారు చాపెల్.
ఇక జులై 23న మాంచెస్టర్ లో ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ గిల్ కి అసలైన పరీక్ష అని అన్నారు చాపెల్. ఐదు మ్యాచ్ ల సిరీస్ ను హీడింగ్లో 5 వికెట్ల తేడా ఓటమితో ఆరంభించిన ఇండియా.. ఆ తర్వాత ఎడ్జ్ బాస్టన్ లో 336 పరుగుల ఘనవిజయంతో పుంజుకున్నప్పటికీ లార్డ్స్ టెస్ట్ ఓటమితో మళ్ళీ వెనకబడింది టీం ఇండియా. ఇక 23న జరిగే మాంచెస్టర్ టెస్ట్ లో ఇండియా ఓడినా లేక డ్రాతో సరిపెట్టుకున్నా... ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచే ఛాన్స్ కోల్పోతుంది ఇండియా.
ALSO READ : IND vs ENG: ఆ ఒక్కడు ఉండుంటే.. లార్డ్స్ టెస్ట్ ఇండియా ఈజీగా గెలిచేది: ఇంగ్లాండ్ మాజీ బౌలర్
మాంచెస్టర్ టెస్ట్ గిల్ కి బ్యాట్స్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా పెద్ద పరీక్ష అని చెప్పాలి. జాక్ క్రాలీపై శుభ్‌మన్ గిల్ స్లెడ్జింగ్ చేయడంపై కూడా కామెంట్స్ చేశారు చాపెల్, గిల్ మంచి కమ్యూనికేటర్ గా ఎదగటంపై దృష్టి పెట్టాలని... గ్రౌండ్ లోకి దిగిన ప్రతిసారి రన్స్ సాధించడం సాధ్యం కాదని అన్నారు చాపెల్.