గర్భిణులకు అనీమియా స్క్రీనింగ్ చేయాలి : డీఎంహెచ్వో మనోహర్

గర్భిణులకు అనీమియా స్క్రీనింగ్ చేయాలి : డీఎంహెచ్వో మనోహర్

యాదాద్రి, వెలుగు:   మూడు నెలలలోపు గర్భిణీలకు 'సికిల్ సెల్ అనీమియా' స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని డీఎంహెచ్​వో మనోహర్​ సూచించారు. గర్భిణీల బ్లడ్​ శాంపిల్స్​ సేకరించి టీ హబ్​లో టెస్ట్​లు నిర్వహించి, రిపోర్టులను 'బ్లడ్​ సెల్​ పోర్టల్​'లో అప్​లోడ్​ చేయాలన్నారు. 

ఆఫీసులో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కాలేయ సంబంధిత వ్యాధులను అరికట్టే హెపటైటిస్ బి వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూడు డోసుల్లో వేయాలన్నారు. స్వస్థ నారీ అభియాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా పీహెచ్​సీ, సీహెచ్​సీ, పల్లె దవాఖానల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు యశోధ, సాయి శోభ, డాక్టర్లు​ కే మధురిమ, స్వప్న రాథోడ్, సృజన, సందీప్ రెడ్డి ఉన్నారు.