సూపర్ హీరోల ‘వార్‘ మొదలైంది

సూపర్ హీరోల ‘వార్‘ మొదలైంది

హృతిక్ రోషన్, టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌… ఇద్దరూ యాక్షన్ హీరోలే. ఈ ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. నిజంగా కాదులెండి… సినిమాలో. ఆ సినిమా పేరు ‘వార్’. సిద్ధార్థ్‌‌ ఆనంద్ దర్శకత్వంలో యశ్‌‌రాజ్ ఫిల్మ్స్‌‌ రూపొందిస్తున్న ఈ చిత్రం.. ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్. ఎంత భారీ అంటే… ఇందులో యాక్షన్ సీక్వెన్సుల్ని కంపోజ్ చేయడానికి శాన్ ఆండ్రియాస్, గేమ్‌‌ ఆఫ్​ థ్రోన్స్‌‌కి పని చేసిన పాల్ జెన్సింగ్స్‌‌ని.. ఐ ఇన్‌‌ ద స్కై, డెత్‌‌ రేస్ వంటి చిత్రాలకు పని చేసిన ఫ్రాంజ్‌‌ స్పిల్హాస్‌‌ని… ఏజ్‌‌ ఆఫ్‌‌ ఆల్ర్టాన్, స్నో పియర్సర్‌‌‌‌ మూవీస్‌‌కి పని చేసిన సీ యంగ్‌‌ని.. టైగర్‌‌‌‌ జిందా హై, మేరీ కోమ్, కేసరి చిత్రాలకు వర్క్ చేసిన పర్వేజ్‌‌ షేక్‌‌ని తీసుకున్నారు. వీళ్లు నలుగురూ ఒక సంవత్సరం పాటు కష్టపడి ఫైట్స్‌‌ని డిజైన్ చేశారు. హాలీవుడ్‌‌ మూవీకి ఏమాత్రం తగ్గకుండా రూపొందించాలన్న ఉద్దేశంతోనే ఇంత టైమ్ తీసుకుని మరీ పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఈ ఫైట్స్‌‌ని ఏడు దేశాల్లోని పదిహేను నగరాల్లో చిత్రీకరించడం మరీ విశేషం. హృతిక్, టైగర్‌‌‌‌ నువ్వా నేనా అన్నట్లు పర్‌‌‌‌ఫార్మ్ చేస్తారట. యాక్షన్‌‌ ఫిల్మ్స్‌‌ని ఇష్టపడేవారికి ఐ ఫీస్ట్‌‌లా ఉంటుందట. ఇవన్నీ వింటుంటే ఈ మూవీ అక్టోబర్‌‌‌‌ 2న థియేటర్లలో పెద్ద హంగామాయే చేస్తుందనిపిస్తోంది.