
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’.తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం ఈ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. బీగీ శారీ అంటూ సాగే ఈ పాటను సచిన్ జిగర్ కంపోజ్ చేయడంతో పాటు అద్నాన్ సమీ, శ్రేయా ఘోషల్‌తో కలిసి పాడారు. అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాశారు.
వర్షం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఈ పాటలో సిద్ధార్థ్, జాన్వీ కపూర్‌ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఎన్నో వాన పాటలు వచ్చి ఎవరు గ్రీన్గా నిలిచాయి. అందులో ఈ పాట కూడా చేరుతుందని క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | HarrisJayaraj: టాలీవుడ్‌కు హారిస్ జయరాజ్ సాలిడ్ కమ్ బ్యాక్.. కొత్త సాంగ్ విన్నారా?
నార్త్ ఇండియాకు చెందిన పరమ్‌గా సిద్ధార్థ్, కేరళకు చెందిన సుందరిగా జాన్వీ ఇందులో నటిస్తున్నారు. వీళ్లిద్దరి పెళ్లికి ఎదురయ్యే కల్చరల్ డిఫరెన్సెస్ ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్స్ లో విడుదల కానుంది.