
హీరో సిద్ధార్థ్ (Siddarth) లేటెస్ట్ మూవీ చిన్నా.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ (సెప్టెంబర్ 28న) రిలీజ్ అయ్యి..పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి సేతుపతి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహించారు.ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వగానే సిద్ధార్థ్ కు చేదు అనుభవం ఎదురైంది.కావేరి నది జలాలపై వివాదం నెలకొనగా..నిరసన తెలిపే కార్యకర్తలు ఒక్కసారిగా ప్రెస్ మీట్ హాలులోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో హీరో సిద్ధార్ధ్ ప్రెస్ మీట్ కి వచ్చిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెబుతూ..అక్కడి నుంచి వెళ్లిపోయారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఇలా జరగడం నిజంగానే బాధాకరం అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
సిద్ధార్ధ్ కొంతకాలంగా తెలుగు సినిమాలకి దూరం అయినప్పటికీ..ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం ఈ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా మహా సముద్రం, టక్కర్ మూవీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడాయి. కోలీవుడ్ తోపాటు తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న సిద్దార్థ్. లేటెస్ట్ కోలీవుడ్ మూవీ చిత్తా ని..చిన్నాపేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. లవ్ ఎమోషనల్ గా తెరకెక్కిన ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Actor #Siddharth Forced To Walk Out During His #Chithha Press Meet pic.twitter.com/zNASABx1IU
— VijayAlif ?ᗪ?️ (@VijayAlif5) September 28, 2023