
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట కలెక్టర్ హైమావతి శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రంలో పర్యటించి పలు ప్రభుత్వ ఆఫీసులను తనిఖీ చేశారు. పీహెచ్సీలో స్టాప్ నర్స్ లక్ష్మి, అటెండర్ తప్ప సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని డీఎం హెచ్ ఓ ను ఆదేశించారు. తహసీల్దార్ఆఫీసులో భూభారతి దరఖాస్తుల ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని సందర్శించి ఫర్టిలైజర్ స్టాక్ వివరాలను బోర్డుపై నమోదు చేయాలని సూచించారు.
స్టాక్, సేల్స్ రిజిస్టర్ కు పొంతన కుదరడంలేదని షాప్యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాములో ఎరువుల వివరాలను తీసుకురావాలని ఏడీఏను ఆదేశించారు. సిమెంట్, ఐరన్ ధరలు వ్యాపారులు విపరీతంగా పెంచారని ఇందిరమ్మ లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్ యజమాలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణీత ధరలకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించారు. గుండారం జడ్పీ, ప్రైమరీ స్కూళ్లను సందర్శించి సమయం దాటిపోయినా వంట చేయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్చంద్రశేఖర్, ఎంఈఓ మహతీ లక్ష్మి ,ఎంపీఓ ఉన్నారు.