
సిద్దిపేట రూరల్, వెలుగు: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట నాసర్ పుర పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిద్దిపేట పట్టణం నుంచి లింగారెడ్డిపల్లి మీదుగా చిన్నకోడూరు వెళ్లే రోడ్ వెంట బ్రిడ్జి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇందిరమ్మ కాలనీలోని బస్తీ దవాఖానను తనిఖీ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి లోని గురుకుల హాస్టల్ కు వెళ్లారు. ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోవడంతో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాలపేట పీహెచ్సీని తనిఖీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇండ్లు నిర్మించుకునేందుకు సుముఖంగా లేని లబ్ధిదారుల వద్ద లెటర్ తీసుకొని, ఆ ఇంటిని మరొకరికి ఇవ్వాలని చెప్పారు. గవర్నమెంట్ ఆఫీస్ లపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలన్నారు.