డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరుగొద్దు

డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరుగొద్దు
  • సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలోని చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్​ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఆఫీసులో సిద్దిపేట రూరల్ మండలంలోని ఆయా గ్రామ  సర్పంచులు, ఎంపీటీసీలు టూబీహెచ్ కే నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల నిర్మాణంలో ఎట్టిపరిస్థితుల్లో జాప్యం జరుగొద్దని, వీలైనంత త్వరగా కంప్లీట్​ చేయాలని సూచించారు.

ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్​ అయినచోట అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఇందుకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు జిల్లా అధికారులను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. వారికి ప్రజాప్రతినిధులు సహకరించి పనులు త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంత రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి చంద్రమోహన్ రెడ్డి, బీసీ ఆఫీసర్ సరోజ, టూబీహెచ్ కే డీఎన్వో శ్యాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గ్రూప్–1 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 16న నిర్వహించే గ్రూప్–1 ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. పట్టణంలో 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.