ఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మించుకోవాలి : కలెక్టర్ హైమావతి

ఇందిరమ్మ ఇండ్లు వేగంగా నిర్మించుకోవాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను వేగంగా నిర్మించుకోవాలనికలెక్టర్ హైమావతి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమానికి హాజరై పరిశీలించారు. గ్రామంలో 18 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 12 ఇండ్లకు ముగ్గు పోశారు. కలెక్టర్​మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేని పేదలకు ఐకేపీ ద్వారా లోన్ అందించాలని డీఆర్డీవో పీడీ జయదేవ్ ఆర్యను ఆదేశించారు. 

ఇసుక కొరత రాకుండా టోకెన్లు అందించాలని తహసీల్దార్​, ఎంపీడీవో కు సూచించారు. అనంతరం చంద్లాపూర్ గ్రామంలో గల పీవీ నరసింహారావు పశుసంవర్ధక పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ లో అడ్మిషన్ల పోస్టర్​ను ఆవిష్కరించారు. జూలై 29 వరకు అప్లై చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల, ధూల్మిట్ట, కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన స్టూడెంట్స్​మాత్రమే అప్లయ్ చేసుకోవాలని సూచించారు. 

మెనూ ఎందుకు పాటించడం లేదు ?

కోహెడ: మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్​ను కలెక్టర్​హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీ మెనూ ఎందుకు పాటించడం లేదని, మధ్యాహ్న భోజన నిర్వాహకులను, ప్రిన్సిపాల్​మహమూద్ ను ప్రశ్నించారు. ఆలుగడ్డ కూర మాత్రమే వండారని, సాంబారు చేయలేదని నిలదీశారు. డైనింగ్ హాల్ ఉన్నా ఆరు బయట స్టూడెంట్స్​కు భోజనం వడ్డించడంపై కలెక్టర్​ అసహనం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్​కు విద్య, బోధన, భోజనం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

అంతకుముందు మండల సమాఖ్య భవనం లో స్టీల్ బ్యాంక్ ను పరిశీలించారు. ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాలని సూచించారు. మండలంలోని మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను ఆపి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం టోకెన్ లు తీసుకుని వేరొకచోటికి మళ్లిస్తున్నట్లు గుర్తించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్​ వెంట డీపీవో దేవకిదేవి, ఎంపీడీవో కృష్ణయ్య, ఏపీఎం తిరుపతి, ఎంపీవో శోభ ఉన్నారు.