
- సిద్దిపేట సీపీ బి. అనురాధ..
సిద్దిపేట రూరల్, వెలుగు : సైబర్ నేరాలు జరగకుండా సైబర్ వారియర్స్ ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట సీపీ బి. అనురాధ సూచించారు. శుక్రవారం శిక్షణ పొందిన కానిస్టేబుళ్లకు సైబర్ నేరాల నివారణపై సీపీ ఆఫీసులో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ నేరాలు ఛేదించడం కోసం కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్‌ను సైబర్ వారియర్‌గా నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. బాధితులు నేషనల్ సైబర్ క్రైం విభాగం హెల్ప్ లైన్ నంబర్ 1930 సమాచారం అందజేయాలని సూచించారు.
మహిళల రక్షణకు పెద్దపీట వేయాలి
సిద్దిపేట రూరల్, వెలుగు : మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని, నిజాయతీగా విధులు నిర్వహించాలని పోలీసులకు సీపీ అనురాధ సూచించారు. శుక్రవారం సీపీ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల వివరాలను ఎసీపీ, సీఐలను, ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారుసమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, ఏసీపీలు సతీశ్, రమేశ్, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మల్లన్నను దర్శించుకున్న సీపీ
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. ఆలయ చైర్మన్ లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.