సిద్దిపేట, వెలుగు: కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులకు రాత్రివేళల్లో ప్రత్యేక భద్రత కల్పిస్తామని సీపీ రష్మీ పెరుమాల్ హామీ ఇచ్చారు. సిద్దిపేట సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం జిల్లా టీఎన్జీవో నాయకులు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రిపూట కలెక్టరేట్ నుంచి పొన్నాల క్రాసింగ్ వరకు మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను సీపీ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రంరెడ్డి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు నీలకంఠ మఠం నగేశ్, కార్యదర్శి చెవిటి సుమన్, మహిళా ఉపాధ్యక్షురాలు విఠల్ ప్రియాంక పాల్గొన్నారు.
