
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట డివిజన్ పరిధిలో పోయిన, చోరీకి గురైన 43 ఫోన్లను రికవరీ చేసినట్లు ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. బుధవారం వాటిని బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.