
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ఫిర్యాదు దారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణికి భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు తదితర సమస్యల పై 78 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.