Tillu Square Siddu Speech: తారక్ అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్న..ఆసక్తిగా సిద్దు జొన్నలగడ్డ స్పీచ్

Tillu Square Siddu Speech: తారక్ అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్న..ఆసక్తిగా సిద్దు జొన్నలగడ్డ స్పీచ్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్(ఏప్రిల్ 8న) నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్ లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ..“ఈ మూవీ ఇంత బాగా రావడానికి చాలా రోజులుగా కృషి చేసిన మా చిత్ర బృందం మొత్తానికి, అలాగే ఈ సినిమాకి ఆదరించి ఇంతటి ఘాన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు. ఒక ఇద్దరి గురించి నేను మాట్లాడాలి, అందులో ముందుగా త్రివిక్రమ్. 

డీజే టిల్లు సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రమేయం ఎంత అని చాలామంది నన్ను పదే పడే అడుగుతుంటారు. ఒక స్టూడెంట్ జీవితంలో టీచర్ ప్రమేయం ఎంత ఉంటుందో అంత ఉంటుంది నా లైఫ్ లో. సినిమా గురించి, జీవితం గురించి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. త్రివిక్రమ్ ని కలవక ముందు వేరే మనిషి, కలిశాక వేరే మనిషిని. జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నా అని సిద్ధు అన్నారు.

అలాగే ఇంత బిజీలో ఉండి కూడా, అడిగిన వెంటనే మాకు ఆయన టైం ఇచ్చి, ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ కి మనస్ఫూర్తిగా  కృతఙ్ఞతలు. టిల్లు సినిమా చేసిన తర్వాత నీకేమైనా అవార్డులు వచ్చాయా అని చాలామంది అడుగుతూ ఉండేవారు, అప్పుడు అందరికీ తారక్ నా గురించి మాట్లాడిన వీడియో చూపించేవాడిని. ఎందుకంటే. నేను చెప్పిన డైలాగ్ తారక్ అన్న నోటి నుంచి రావడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు.

త్రివిక్రమ్ చెప్పినట్టుగా.. నాకు, విశ్వక్ సేన్ సహా ఎందరో యువ నటులకి ఎన్టీఆర్ నిజంగానే టార్చ్ బేరర్.ఇటీవల కలిసినప్పుడు చిన్న సినిమా గురించి గంట మాట్లాడారు, అది ఆయన గొప్పతనం. అలాగే మాకు దేవర పాటలు కూడా వినిపించారు. దేవర విడుదల సమయంలో తారక్ అన్నని ఇంటర్వ్యూ చేయబోతున్నా, అప్పుడు మీతో చాలా విషయాలు పంచుకుంటాను. అలాగే ఈ ఈవెంట్ కి వచ్చిన మా గురించి ఇంత బాగా మాట్లాడిన విశ్వక్ సేన్ కి థాంక్స్. టిల్లు క్యూబ్ తో మిమ్మల్ని మరింత అలరిస్తానన్నారు.