Tillu Square Collections: బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తున్న టిల్లు మామ..ఆపడానికి వస్తున్న స్టార్ హీరో!

Tillu Square Collections: బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తున్న టిల్లు మామ..ఆపడానికి వస్తున్న స్టార్ హీరో!

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)లేటెస్ట్ మూవీ టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ కల్లెక్షన్స్ తో దూసుకెళ్తోంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లూ స్క్వేర్ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేసింది. రిలీజైన మూడు రోజుల్లోనే లాభాల్లోకి రావడమంటే మాటలు కాదు.అంతలా హిట్ కొట్టాడు టిల్లు గాడు. 

లేటెస్ట్ టిల్లూ స్క్వేర్ 5వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే..తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ. 2.80 కోట్లు షేర్ వసూలు చేయాగ..వరల్డ్ వైడ్‌గా రూ.3.50 కోట్లు రాబట్టింది.ఇలా మొత్తం ఐదు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ రూ. 43.50 కోట్లు వరకూ షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది.

ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు రూ.85కోట్లు గ్రాస్ వచ్చింది..అంతేకాదు రోజు రోజుకు కలెక్షన్స్ స్టేబుల్ గానే ఉంటున్నాయి తప్ప..ఏ మాత్రం డౌన్ అవ్వట్లే. ఇక టిల్లు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల వైపు పరుగులు తీస్తోంది.

అంతేకాదు ఇపుడు ఎక్కడ చూసిన సిద్ధూ హంగామా నడుస్తుంది.దీన్ని బట్టి చూస్తే టిల్లు హవా ఇప్పట్లో తగ్గేదెలా అనిపిస్తోంది.కానీ, ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తుండటంతో అడ్డుకట్ట పడే ఛాన్స్ కనిపిస్తోంది. మరి అప్పటిలోగా సిద్దు మామ రూ.100 కోట్ల మార్క్ అందుకుంటాడో లేదో చూడాలి.