
‘డీజే టిల్లు’గా కడుపుబ్బ నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ.. ‘టిల్లు స్క్వేర్’తో డబుల్ నవ్వులు పంచడానికి రాబోతున్నాడు. దీపావళి సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రివీల్ చేశారు. ఫుల్ ఫన్‌తో కట్ చేసిన వీడియో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిష్ వెంకట్‌తో గొడవ పెట్టుకోవడం నవ్వులు పూయించింది.
‘ఆల్కహాలు నాకిష్టం. స్ట్రా ఎవరెవరి నోట్లో పెట్టావు. ఫ్రెష్ స్ట్రానా’ అని అడుగుతాడు సిద్ధు. దీంతో ‘సార్‌ని పిలవమంటావా’ అని వెంకట్ అంటే.. ‘పిలువు.. మీ సార్ పైసలతో తాగామా, మా అయ్య పైసలతో తాగాం’ అంటూ తాను డీజే టిల్లు హీరోనని చెప్పడం ఆకట్టుకుంది. ఫస్ట్ పార్ట్‌లో పాపులర్ అయిన ‘అట్లుంటది మనతోని’ అనే డైలాగ్‌ని రిపీట్ చేసి ఇంప్రెస్ చేశాడు. రామ్ మిరియాల బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో సినిమా రిలీజ్ చేయనున్నారు.