కెచప్ ఎక్కువగా తింటున్నారా ?

కెచప్ ఎక్కువగా తింటున్నారా ?

ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్, స్నాక్స్.. ఏవి తిన్నా టొమాటో కెచప్ పక్కన ఉండాల్సిందే. కానీ కెచప్​ను ఎక్కువ తింటే మాత్రం డేంజర్ అంటున్నారు ఎక్స్​పర్ట్స్.   రుచి కోసం టొమాటో కెచప్​లో చక్కెర,ఉప్పు, ఫ్రక్టోజ్, ప్రిజర్వేటివ్స్, మొక్కజొన్న సిరప్​లను కలుపుతారు. ఇవి తింటే మన బాడీపై ఎఫెక్ట్ పడుతుంది.   టొమాటోలో ఎక్కువగా సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్​లు ఉంటాయి. ఇవి గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్​కు దారితీస్తాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు కెచప్ తినకపోవడమే బెటర్.   చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ ఫ్యాట్ పెరిగి, ఒబేసిటీ బారిన పడతారు. దీనిలో ఉన్న హిస్టమైన్ శరీరంలో కొన్ని రకాల అలర్జీలకు కారణం అవుతుంది. వీటిల్లో ఉండే  ఫ్రక్టోజ్, కార్న్ సిరప్​ల వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె జబ్బులు కూడా వస్తాయి.   ప్రిజర్వేటివ్స్ వల్ల మంటలు, కీళ్లనొప్పులు వస్తాయి. సోడియం, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల క్యాల్షియం పెరిగి కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశం ఉంది.