ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ కేంద్రం ప్రారంభించిన సిద్స్‌‌‌‌ ఫార్మ్‌‌‌‌

ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ కేంద్రం ప్రారంభించిన సిద్స్‌‌‌‌ ఫార్మ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ కేంద్రంగా పనిచేసే  ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌‌‌‌  సిద్స్‌‌‌‌ ఫార్మ్‌‌‌‌  తమ మొట్టమొదటి స్టోర్‌‌‌‌, ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డీఆర్‌‌‌‌డీఓలో అడిషినల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌  షేక్‌‌‌‌ గౌస్‌‌‌‌ మోహిద్దీన్‌‌‌‌ సమక్షంలో దీనిని ప్రారంభించారు.   అత్యున్నత నాణ్యత, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులను స్టోర్‌‌‌‌లో దొరుకుతాయి. కంచన్‌‌‌‌భాగ్‌‌‌‌లోని డీఆర్‌‌‌‌డీఓ టౌన్‌‌‌‌షిప్‌‌‌‌ లో ఈ స్టోర్‌‌‌‌ ఉంటుంది.  ఈ సంస్థ నిత్యం 15వేల మందికి పైగా వినియోగదారులకు డెయిరీ ప్రొడక్టులను డెలివరీ చేస్తోంది. ఈ  నూతన  కేంద్రం తెరవడం  గురించి సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌  డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘ మా ఫార్మ్‌, ప్లాంట్‌, లేబరేటరీలను శనివారాల్లో వచ్చి చూడాల్సిందిగా కస్టమర్లను ఆహ్వానిస్తున్నాం.  స్వచ్ఛమైన, యాంటీబయాటిక్స్‌, హార్మోన్లు, నిల్వకారకాలు లేని పాలు, పాల ఉత్పత్తులను అందించడానికి మేం చేస్తున్న ప్రయత్నాలను స్వయంగా చూడొచ్చు”అని అన్నారు.