దేశీ ఆవు పాలను మార్కెట్లోకి తీసుకురానున్న సిద్స్ ఫామ్

 దేశీ ఆవు పాలను మార్కెట్లోకి తీసుకురానున్న సిద్స్ ఫామ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్​ ఫామ్  75వ ఇండిపెండెన్స్​ డేను పురస్కరించుకొని ఏ2 దేశీ ఆవు పాలను మార్కెట్లోకి తీసుకురానుంది. వీటికి ట్రయల్ కస్టమర్ పూల్ నుండి మంచి స్పందన వచ్చిందని ప్రకటించింది. సులభంగా జీర్ణం కావడం, అధిక ప్రొటీన్లు, రోగనిరోధక వ్యవస్థను సులభతరం చేయడం దీని ప్రత్యేకత. దేశీ ఆవుపాలలో బీటా-కేసిన్ ఏ1 & ఏ2 ఉంటాయి. సిద్స్​ఫామ్​ ఫౌండర్​ డాక్టర్ కిషోర్ ఇందుకూరి మాట్లాడుతూ తమ పాలలో యాంటీ బయాటిక్స్, హార్మోన్లు  ప్రిజర్వేటివ్‌‌‌‌‌‌‌‌లు ఉండవని చెప్పారు. మన భారతీయ ఆవు జాతుల నుండి క్వాలిటీ మిల్క్​ను అందిస్తామని అన్నారు.