రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ గురుగ్రామ్‌లో లగ్జరీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇటలీ లగ్జరీ లైఫ్‌స్టైల్ బ్రాండ్ టోనినో లంబోర్గినితో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,900 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో 812 లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ఈ భాగస్వామ్యం ద్వారా టోనినో లంబోర్గిని భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

