
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్ రూ. 875 కోట్ల విలువైన దాని దీర్ఘకాలిక నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) ఇష్యూకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ నుండి కేర్ ఏ ప్లస్ రేటింగ్‌ను పొందినట్లు సోమవారం వెల్లడించింది. 146 లక్షల చదరపు అడుగుల్లో ప్రాజెక్టులను అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డ్ వల్ల కేర్ ఏ ప్లస్ రేటింగ్‌ను సాధించామని తెలిపింది.
2025 ఆర్డిక సంవత్సరంలో, కంపెనీ బుకింగ్‌లు గత సంవత్సరం తో పోలిస్తే 42% పెరిగి రూ. 10,290 కోట్లకు చేరుకోగా, వసూళ్లు 40శాతం పెరిగి రూ. 4,380 కోట్లకు చేరుకున్నాయి. 100 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఏడు కొత్త ప్రాజెక్టులను ఇది పూర్తి చేసింది.