SIIMA 2023 అవార్డ్స్ ..బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ లిస్ట్.. మీ హీరో ఉన్నాడా?

SIIMA  2023 అవార్డ్స్ ..బెస్ట్ యాక్టర్ నామినేషన్స్  లిస్ట్..  మీ హీరో ఉన్నాడా?

SIIMA అవార్డ్స్ 2023(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతి సంవత్సరం కండక్ట్ చేయబడతాయి. ఇది అత్యంత గుర్తింపు పొందిన అవార్డు గా భావిస్తారు. ఈ ఏడాది 2023 సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్‌ వేదిక కానుంది. ఈ అవార్డ్స్‌కు పోటీ పడుతున్న హీరోస్ లిస్ట్ ను సైమా రిలీజ్ చేసింది. గతేడాది రిలీజై, ఆడియన్స్ కు మంచి ఫీల్ ఇచ్చిన ఈ హీరోల టాలెంట్ ను గుర్తించి.. SIIMA అవార్డులు ఇవ్వునున్నారు.

మేజర్ మూవీతో సెన్సషనల్ హిట్ అందుకున్న హీరో అడవి శేష్ (Adivi Sesh),  
సీతారామం మూవీతో మంచి క్లాసిక్ హిట్ తో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan),
 RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ స్టేటస్ పొందిన జూ.ఎన్టీఆర్(N. T. R Jr), రామ్ చరణ్(Ram Charan) తో పాటు  

మిస్టరీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌,  స్పిరిట్యుయల్ కంటెంట్ తో సక్సెస్ అయినా.. కార్తికేయ మూవీతో నిఖిల్ సిద్దార్ద్( Nikhil Siddhartha), 

అలాగే యూత్ లో కొత్త జోష్ తీసుకొచ్చిన DJ టిల్లు హీరో  సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). 

టాలీవుడ్ లో మంచి హిట్ దక్కించుకున్న ఈ హీరోస్ యాక్టింగ్ కు..ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఏ హీరోకు SIIMA అవార్డు దక్కుతుందో చూడాలి. కాగా  RRR మూవీ ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుని టాప్ లో నిలువగా, తర్వాత, 10 కేటగిరిల్లో సీతారామం కి నామినేషన్స్‌ దక్కాయి. 

ఈ అవార్డ్స్ ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చలనచిత్ర పరిశ్రమల నుండి దక్షిణ భారత చలనచిత్రాలలో బెస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచిన మూవీస్ కు, డైరెక్టర్స్, హీరోస్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన వారికి ఈ అవార్డ్స్ ను అందిస్తారు.