సినిమా ఫ్యాన్స్ ఎప్పుడెప్పాడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్ వేడుక త్వరలోనే జరగనుంది. ప్రతి సంవత్సరం గ్రాండ్ గా నిర్వహించే ఈ వేడుకకు సంబంధించి ఈ ఇయర్ నామినేషన్లు రిలీజ్ అయ్యాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు సంబంధించి ఏటా నిర్వహించే సైమా SIIMA (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు.వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.
సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తారు. సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులతో సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో సైమా అవార్డుల వేడుకలను దుబాయ్‌లో నిర్వహించునున్నారు. ఇప్పటికే సెలెబ్రేటిస్ అందరు దుబాయ్ కు చేరుకున్నారు.
Also Read :- బిజినెస్ రంగంలోకి సెలబ్రిటీ కపుల్స్.. బ్రాండ్ ఏంటంటే ?
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి వివిధ కేటగిరీలకు సంబంధించిన నామినేషన్లు ఇవే!
ఉత్తమ నటుడు – తెలుగు (2023)
మేజర్ హీరో అడవి శేష్ (Adivi Sesh),
సీతారామం దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan),
RRR జూ.ఎన్టీఆర్(NTR Jr) రామ్ చరణ్(Ram Charan)
కార్తికేయ నిఖిల్ సిద్దార్ద్( Nikhil Siddhartha),
DJ టిల్లు సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).
ఉత్తమ దర్శకుడు – తెలుగు (2023)
రాజమౌళి (SS Rajamouli) (ఆర్‌ఆర్‌ఆర్),
హను రాఘవపూడి (Hanu Raghavapudi) (సీతారామం),
చందూ మొండేటి (Chandoo Mondeti) (కార్తికేయ 2),
శశికిరణ్ తిక్కా (Sashi Kiran Tikka)(మేజర్),
విమల్ కృష్ణ (డీజే టిల్లు) (Vimal Krishna)
ఉత్తమ గేయ రచయిత
నాటు నాటు (RRR) సాంగ్ ను చంద్రబోస్(Chandrabose)
సీతారామం ఇంతందం సాంగ్ కు కృష్ణకాంత్(krushnakant)
ఆచార్య నుంచి లాహె లాహె సాంగ్ రామజోగయ్య(Ramajogayya)
RRR నుంచి సుద్దాల(Suddala Ashok Teja) రాసిన కొమురం భీముడో సాంగ్
ఉత్తమ సహాయ నటి
ఒకే ఒక జీవితం మూవీకి గాను అక్కినేని అమల(Akkineni Amala),
విరాట పర్వం ప్రియమణి(Priyamani),
భీమ్లా నాయక్ సంయుక్త మీనన్ (Samyukta Meenon).
మాసూద ఇందులో కీ రోల్ ప్లే చేసిన సంగీత(Sangeetha),
మేజర్ మూవీకు గాను శోభిత ధూళిపాళ(Shobita Dhulipala)
ఉత్తమ విలన్
జయరామ్(JayaRam) ధమాకా
సముద్రకని(Samudrakani) సర్కారు వారి పాట
సత్యదేవ్(SatyaDev) గాడ్ ఫాదర్
సుహాస్(Suhas) హిట్-2
కాగా.. పుష్ప మూవీతో నేషనల్ అవార్డు గెలుచున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..సైమా లో కనీసం నామినేషన్ కాకపోవడం పట్ల ఫ్యాన్స్ ఖండిస్తున్నారు.