
ఈ ఏడాది ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరగబోతోంది. దుబాయ్‌లో జరగబోయే ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. రానా మాట్లాడుతూ ‘గత 11 ఏళ్లుగా సౌత్ సినిమా ఇండస్ట్రీస్ అన్నీ కలిసి ఆనందంగా జరుపుకుంటున్న వేడుక ఇది. గ్లోబల్ ఫ్లాట్ ఫామ్‌కి చేరుకోడానికి సైమా గొప్ప వేదిక.
ఈ వేడుకల్లో భాగమవడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. ‘అన్ని చిత్ర పరిశ్రమలు సినిమాని ఒక పండుగలా జరుపుకునే ఈ వేడుక కోసం ఎదురుచూ స్తున్నాం ’ అని చెప్పింది మీనాక్షి చౌదరి. ‘లెజండరీ నటీనటులతో కలసి వేదిక పంచుకోనుండటం సంతోషంగా ఉంది’ అని నిధి అగర్వాల్ చెప్పింది. సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ ‘అన్ని సినిమా ఇండస్ట్రీస్‌కు ఇది ఒక రీ యూనియన్, హోమ్‌కమింగ్ లాంటిది. రానా గారు లేకుండా సైమా వేడుకని ఊహించలేం. ఈ వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది. దుబాయ్‌లో కలుద్దాం’ అన్నారు.