సికందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్​

సికందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్​

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘సికందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’.  తమిళ దర్శకుడు ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాద్‌వాలా  దీన్ని నిర్మిస్తున్నారు. ఈద్ సందర్భంగా ఈ మూవీపై అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా షూటింగ్ ప్రారంభించారు.  మంగళవారం నుంచి ముంబైలో షూటింగ్ జరుగుతోంది.  యాక్షన్ సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు.  జులై మొదటి వారం వరకూ ఈ షెడ్యూల్ జరగనుంది. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చే సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. రష్మిక ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించబోతోంది.  అలాగే సత్యరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నట్టు టాక్.  వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే మరో తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారంలో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.