సామాన్యులకు అందనంతగా.. వెండి ధర@ రూ.1.15 లక్షలు

సామాన్యులకు అందనంతగా.. వెండి ధర@  రూ.1.15 లక్షలు
  • ఒక్కరోజే రూ. 5 వేల పెరుగుదల

న్యూఢిల్లీ: యూఎస్​ టారిఫ్స్​పై క్లారిటీ లేకపోవడం, డాలర్ బలహీనత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడంతో జాతీయ రాజధానిలో సోమవారం వెండి ధరలు కేజీకి రూ. 5 వేలు పెరిగి రూ. 1,15,000 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. 

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, శనివారం ధర రూ. 4,500 పెరిగి రూ. 1,10,000 జీవితకాల గరిష్ట స్థాయిని చేరింది. హైదరాబాద్​ మార్కెట్లో సోమవారం కిలో వెండి ధర రూ.1.23 లక్షలకు చేరింది. "వెండి ధరలు పెరుగుతున్నాయి. 

దేశీయ మార్కెట్లో కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయిని తాకింది. బంగారం ప్రత్యామ్నాయాలపై ఆసక్తి దీనికి కారణం" అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. కమోడిటీస్ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెండి ఫ్యూచర్స్ రూ. 2,135 పెరిగింది.