జియోలో రూ.5,655 కోట్ల ఇన్వెస్టింగ్ కు సిల్వర్ లేక్ రెడీ

జియోలో రూ.5,655 కోట్ల ఇన్వెస్టింగ్ కు సిల్వర్ లేక్ రెడీ

న్యూఢిల్లీ: రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ సిద్ధమైంది. జియో ప్లాట్ ఫామ్స్ లో 750 మిలియన్ డాలర్ల (రూ. 5,655.75 కోట్లు)ను సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేయనుంది. ఈ పెట్టుబడి జియో ప్లాట్ ఫామ్స్ లోని 4.90 లక్షల కోట్ల ఈక్విటీ వ్యాల్యూతో సమానమని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది.

‘ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ టెక్నాలజీ కంపెనీస్ కు వ్యాల్యుబుల్ పార్ట్ నర్ గా ఉన్న అసాధారణ రికార్డు సిల్వర్ లేక్ సొంతం. టెక్నాలజీ, ఫైనాన్స్ విషయంలో సిల్వర్ లేక్ అత్యంత గౌరవం కలిగిన సంస్థ’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్ పర్సన్, ఎండీ ముఖేశ్ అంబానీ చెప్పారు. ఇండియన్ డిజిటల్ సొసైటీ ట్రాన్స్ ఫార్మేషన్ కోసం సిల్వర్ లేక్ గ్లోబల్ టెక్నాలజీతో రిలేషన్ షిప్ కోసం తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. జియోలో 10% వాటా కోసం 5.7 బిలియన్లు వెచ్చించడానికి ఫేస్ బుక్ ఐఎన్ సీ ముందుకొచ్చిన రెండు వారాల్లోనే రిలయన్స్ తో సిల్వర్ లేక్ డీల్ కుదిరింది.