
హిట్లూ ఫ్లాపులూ పట్టించుకోకుండా ఏం వెరైటీ మూవీ చేద్దామా అని చూస్తుంటాడు శింబు. సినిమా సినిమాకీ జానరే కాదు, తన లుక్‌నీ మార్చేస్తాడు. తన నలభయ్యేడో సినిమాకి కూడా అదే చేశాడు. ఎవరూ ఊహించని లుక్‌లోకి మారిపోయాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘నాదిగలై నీరదమ్ సూర్యన్’ అనే మూవీకి కమిటయ్యాడు శింబు. ఇప్పుడా టైటిల్‌ని మార్చేసి ‘వెందు తనిందదు కాడు’ (కాలి బూడిదైన అడవి) అనే టైటిల్ పెట్టారు. ఆ విషయాన్ని చెబుతూ శింబు లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. లుంగీ కట్టుకుని, చిరిగిన చొక్కా వేసుకుని చాలా విచిత్రమైన రూపంలో కనిపిస్తున్నాడు శింబు. చేతిలో కర్రతో కాస్త వంగి ఉన్నాడు. టైటిల్‌ని జస్టిఫై చేస్తూ అతని వెనకాల అడవి తగలబడుతోంది. మొత్తానికి ఈ ఇంటెన్స్ లుక్ చూస్తుంటే ఇదేదో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తోంది. ఇషారి కె.గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. శింబు, గౌతమ్, రెహమాన్.. ఈ కాంబినేషన్ చాలు కదా.. అంచనాలు పెంచేయడానికి!