హైదరాబాద్‌‌‌‌లో సాదాసీదాగా నిమజ్జనం

హైదరాబాద్‌‌‌‌లో సాదాసీదాగా నిమజ్జనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా వల్ల హైదరాబాద్‌‌‌‌లో ఈసారి నిమజ్జనం హడావుడి లేకుండా సాదాసీదాగా సాగింది. శోభాయాత్రలు, ట్యాంక్‌‌‌‌బండ్ పరిసరాలు కళ తప్పాయి. అపార్టుమెంట్లు, ఇండ్లు, అక్కడక్కడ కాలనీల్లో ప్రతిష్టించిన విగ్రహాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌కు వచ్చాయి. ఖైరతాబాద్‌‌‌‌ ధన్వంతరి నారాయణ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. శోభాయాత్రలో ఉత్సవ కమిటీ సభ్యులు మినహా వేరే వాళ్లను అనుమతించ లేదు. క్రేన్‌‌‌‌ నం. 3 దగ్గర సాయంత్రం 5.25 గంటలకు నిమజ్జనం జరిగింది. హైదరాబాద్‌‌‌‌ గణేశ్ ఉత్సవాల్లో హైలైట్‌‌‌‌గా నిలిచే బాలాపూర్‌‌‌‌ లడ్డూ వేలం ఈసారి జరగలేదు. 21 కిలోల లడ్డూను సీఎం కేసీఆర్‌‌‌‌కు బుధవారం అందిస్తామని ఉత్సవ కమిటీ ప్రకటించింది. పాతికేళ్ల బాలాపూర్‌‌‌‌ లడ్డూకు లిమ్కా బుక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌లో చోటు దక్కింది. ఉత్సవ కమిటీకి లిమ్కా బుక్‌‌‌‌ ప్రతినిధులు సర్టిఫికెట్‌‌‌‌ అందించారు. ఇక్కడి లడ్డూ గతేడాది రూ.17.65 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.

For More News..

త్వరలో లొంగిపోనున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు

రైతు ఆత్మహత్యల్లో ఐదో స్థానంలో రాష్ట్రం

‘కాళేశ్వరం’ పై కేంద్రం ఆరా

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అప్పులు తీసుకోవడానికే పనికొస్తది