చలికాలంలో పాదాల పగుళ్లు పోవాలంటే

చలికాలంలో పాదాల పగుళ్లు పోవాలంటే

చ‌లికాలంలో పాదాల పగుళ్లు  చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే.. ఇలా చేసి చూడండి. రోజ్ వాటర్​లో గ్లిజరిన్‌ కలిపి పాదాలకు రాస్తే  పగుళ్లు తగ్గుతాయి.   పెరుగు, వెనిగర్‌ని సమానంగా కలపాలి. ఈ మిశ్రమంతో పాదాల్ని పావుగంట  మసాజ్​ చేస్తే  పగుళ్లు  పోతాయి.  అరటి పండుని గుజ్జులా చేసి పగుళ్లున్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత  చన్నీళ్లతో కడిగితే  కాళ్లకి సరిపడా తేమ అంది పగుళ్లు మాయమవుతాయి.  నువ్వుల నూనెలో రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ కలిపి  పాదాలకు మసాజ్ చేస్తే పగుళ్లు తగ్గుతాయి.  కొబ్బరినూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు పట్టిస్తే పగుళ్ల బాధ తగ్గుతుంది. 

 గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ వేయాలి. అందులో కాసేపు పాదాలు ఉంచి మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది.  ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. కాసేపటి తర్వాత చన్నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్​ రాస్తే పగుళ్లు ఇబ్బంది పెట్టవు.   హ్యాండ్ క్రీమ్‌లో నిమ్మరసం కలిపి పాదాలకు రాస్తే  పగుళ్లు తగ్గుతాయి.