
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు BWF వరల్డ్ టూర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం బాలీలో జరిగిన సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై విజయం సాధించింది. ఒక గంట 10 నిమిషాలపాటు సాగిన సెమీస్ మ్యాచ్‌లో 21–-15, 15-–21, 21–-19 తేడా తో యమగుచిని ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన ప్లేయర్ యాన్ సెయోంగ్‌తో సింధు తలపడనుంది.