స్పెయిన్‌‌ మాస్టర్స్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌ ఫైనల్‌‌లో సింధు

స్పెయిన్‌‌ మాస్టర్స్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌ ఫైనల్‌‌లో సింధు

మాడ్రిడ్‌‌‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు స్పెయిన్‌‌ మాస్టర్స్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌లో ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్‌‌ సింధు 24–22, 22–20తో సింగపూర్‌‌కు చెందిన మిన్‌‌ జియాపై ఉత్కంఠ విజయం సాధించింది. 

48 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో జియా మిన్‌‌ నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది.  రెండు గేమ్స్‌‌ చివర్లోనూ గొప్పగా ఆడిన సింధు మ్యాచ్‌‌లో నెగ్గి ఈ సీజన్‌‌లో తొలి టైటిల్‌‌కు అడుగు దూరంలో నిలిచింది.