
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో డబుల్ ఒలింపిక్ పతక విజేత... హైదరాబాదీ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో సింధు జర్మనీకి చెందిన ప్రత్యర్థి యొన్నెలీపై 21-12, 21-18 తేడాతో విజయం సాధించింది. 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్ లో సింధు వరుస సెట్లలో విక్టరీ సాధించింది. రెండో రౌండ్ లో స్పానియర్డ్ బిట్రిజ్-సిమ్ యుజిన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అందులో గెలిచిన విజేతతో..విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు తలపడనుంది.