వీధుల్లోపాటలు​ పాడి ఫీజు కట్టిండు

వీధుల్లోపాటలు​ పాడి ఫీజు కట్టిండు

రిథమిక్​గా పాటలు పాడే టాలెంట్​ ఉంది. గిటార్​ ప్లే చేయడం కూడా వచ్చు. బెస్ట్​ సింగర్​గా పేరు తెచ్చుకోవాలంటే ఇంకా ఇంప్రూవ్​ కావాలి. అందుకని మ్యూజిక్​ స్కూల్లో చేరాలి అనుకున్నాడు. కానీ, ఫీజు కట్టడానికి అవసరమైన డబ్బులు లేవు. తన టాలెంట్​ని నమ్ముకుని వీధుల్లో పాటలు పాడి ఫీజుకి సరిపడా డబ్బులు సంపాదించాడు ముంబయికి చెందిన షకీల్​. రెండు మూడు రోజులుగా అతను పాట పాడుతున్న వీడియో ఇంటర్నెట్​లో వైరల్​ అవుతోంది.   


‘ముంబయి మ్యూజిక్​ ఇని​స్టిట్యూట్‌‌’లో జాయిన్​ అవ్వాలి, ఫేమస్​ సింగర్​ అవ్వాలనేది షకీల్ డ్రీమ్. ఆ డ్రీమ్​ని నిజం చేసుకునేందుకు వీధుల్లో గిటార్​ వాయిస్తూ పాత హిందీ పాటలు పాడాడు.  హిందీ సినిమా ‘జుర్మ్’లోని ఫేమస్​ ట్రాక్​  ‘జబ్​ కోయి బాత్​ బిగడ్ జాయే’ పాడుతున్న షకీల్​ వీడియోని అంకిత్​ అనే వ్యక్తి ట్విట్టర్​లో పెట్టాడు. గత రెండు రోజులుగా ఆ వీడియో ఇంటర్నెట్​లో వైరల్​ అవుతోంది. గిటార్ మీద ట్యూన్స్ పలికిస్తూ అందర్నీ ఎంటర్​టైన్​ చేస్తున్నాడు షకీల్​. ఒక అట్టముక్క మీద తన ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​తో పాటు గూగుల్​ పే, ఫోన్​ పే లింక్​ ఉన్న ఫోన్​ నెంబర్​ రాసి పెట్టాడు. ఆ పేపర్​ మీద ‘మీరు చేస్తున్న సాయానికి థ్యాంక్స్. మీరిచ్చే డబ్బులతో మ్యూజిక్​ స్కూల్​ ఫీజు కడతాను’ అని  కూడా ఉంటుంది. అతడి పాటని ఎంజాయ్​ చేయడమే కాకుండా తలా కొంత డబ్బు పంపించారు కొందరు. బాలీవుడ్ హీరోలు హృతిక్​ రోషన్, కునాల్​ కపూర్​లకి షకీల్ వాయిస్​ నచ్చింది. అతడి సిచ్యుయేషన్​ తెలుసుకుని సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాంతో రెండు రోజుల్లోనే షకీల్​కి మ్యూజిక్​ స్కూల్​ ఫీజుకు సరిపడా డబ్బులు జమయ్యాయి. షకీల్​ పాట విన్న వాళ్లంతా ‘బ్రిలి యంట్​ సింగర్​’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  
గర్వంగా ఫీలవుతున్నా
‘‘నా వీడియో చూసిన వాళ్లకి, నన్ను ఎంకరేజ్​ చేసిన వాళ్లకి, డబ్బులు ఇచ్చిన వాళ్లకి సపోర్ట్​ చేసిన బాలీవుడ్​ స్టార్స్​కి కూడా థ్యాంక్స్​. నాకు నచ్చిన పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వరకు కూడా నన్ను కన్నవాళ్లకి, ఫ్రెండ్స్​కి నేను ఏం చేస్తున్నానో తెలియదు. స్ట్రీట్​ పర్ఫార్మర్​ అయినందుకు గర్వంగా ఫీలవుతున్నా. నా ఐడెంటిటీని అందరితో చెప్పుకునేంత ధైర్యం ఇప్పుడు వచ్చింది” అన్నాడు ఈ యంగ్​ సింగర్​.