రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు..సింగపూర్లో హైఅలర్ట్

రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు..సింగపూర్లో హైఅలర్ట్

కోవిడ్ కేసులు మళ్లీ పెరగడంతో సింగపూర్లో హై అలెర్ట్ ప్రకటించారు. గత రెండు వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 మొత్తంలోనే రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరిగాయి. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 మధ్య దేశంలో 32 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. అంతకుముందు వారంలో 22 వేల కేసు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన సింగపూర్ ఆరోగ్య శాఖ హైఅలెర్ట్ ప్రకటించింది. 

ఆస్పత్రుల్లో చేరడం, ఐసీయూ కేసులు అంత ఎక్కువగా లేనప్పటికీ పెరుగుతున్న కేసులు ఇప్పటికే ఆస్పత్రుల్లో తీవ్ర పని భారాన్ని పెంచాయని ఆరోగ్య శాఖ చెపుతోంది. నేషనల్ యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ (NUHS), SingHealth పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇంటెన్సివ్, ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా స్పందిస్తామని NUHS ప్రతినిధి ఒకరు తెలిపారు. 

మరోవైపు సింగ్ హెల్త కూడా కోవిడ్ కట్టడి అన్ని చర్యలు చేపట్టింది. కరోనా ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. చికిత్స కోసం ఆస్పత్రుల్లో వనరులు పెంచామని తెలిపింది. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం.. అత్యవసరం కానీ పేషెంట్లకు టెలికన్సల్టేషన్,హోమ్ రివకరీ ప్రోగ్రామ్ లతో  సహా ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేస్తున్నామని సింగ్ హెల్త్ తెలిపింది. అత్యవసరమైన పరిస్థితుల్లో వ్యక్తులు ఐసీయూలో చికిత్స పొందేందుకు ఏర్పాటు చేశామన్నారు. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సింగపూర్ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.