
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 15,231హెక్టార్లలో 5.47 లక్షల మొక్కలను నాటామని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెంలోని బంగ్లోస్ ఏరియాలో సోమవారం స్వయంలో ఆయన 204 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఓబీ డంప్‌ల ప్రాంతంతో పాటు మైన్స్‌ల ఆవరణలో మొక్కలను పెంచుతున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ, ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, జీఎంలు ఎ. మనోహర్, సైదులు, ఎన్.రాధాకృష్ణ, ఎ. రవి కుమార్, ఎలిషా పాల్గొన్నారు.