
- కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ సర్వీసెస్ చీఫ్ నియామకానికి నోటిఫికేషన్
- సీఎంఓఏఐ ప్రతినిధుల అభ్యంతరం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్కంపెనీలో కీలకమైన చీఫ్మెడికల్ఆఫీసర్(సీఎంఓ) పోస్టు ఈ నెలతో రద్దు కానుంది. సింగరేణి కోల్మైన్స్వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్, డిస్పెన్సరీలను పర్యవేక్షించే సీఎంఓ పోస్టును ఇక మీదట కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ సర్వీసెస్చీఫ్ పేరిట అధికారిని నియమించనున్నారు. చాలాకాలంగా తాము పర్మినెంట్ డాక్టర్లుగా పని చేస్తున్నామని, తమపై కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్ అధికారి పెత్తనం చేయడమేంటని సీనియర్డాక్టర్లు మండిపడుతున్నారు.
3ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోల్‌మైన్స్ ఆఫీసర్స్అసోసియేషన్ఆఫ్ఇండియా (సీఎంఓఏఐ) మేనేజ్ మెంట్‌కు వినతిపత్రం ఇచ్చింది. కంపెనీ హాస్పిటల్స్‌లో సీనియర్ డాక్టర్లను ప్రతి రెండు, మూడేండ్లకోసారి ప్రమోషన్ల ద్వారా యాజమాన్యం భర్తీ చేస్తుంది. సీఎంఓ పోస్టు రద్దయితే ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. మెడికల్ సర్వీసెస్ చీఫ్‌గా నియమించే అధికారి రెండేండ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈనెల10న యాజమాన్యం నోటిఫికేషన్రిలీజ్చేసింది.
ఇందులో సీఎంఓ స్థానంలో చీఫ్మెడికల్సర్వీసెస్పోస్టు సృష్టించి, అడ్మినిస్ట్రేషన్అప్పగించేలా యాజమాన్యం అందులో పేర్కొంది. దీనిపై కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో జీఎం సీపీపీ మనోహర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. సీఎంఓఏఐ ప్రతినిధులు ఎస్. వెంకటాచారి, కేశవరావు, రాజీవ్ కుమార్, రాజగోపాల్, సునీల, మాలతి, సునీల్‌వర్మ పాల్గొన్నారు. న్నారు.