
గోదావరిఖని, వెలుగు: వాటర్ లారీలోంచి కిందపడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. బిహార్ కు చెందిన వికాస్‌యాదవ్(40), ఓసీపీ–5లో మట్టి (ఓవర్‌బర్డెన్) తొలగించే పీసీ పటేల్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడు. సోమవారం ఓసీపీ క్వారీలోని 830 మీటర్ల లెవల్లో మట్టి పైకిలేవకుండా రోడ్డుపై నీళ్లు చల్లే వాటర్ లారీని వికాస్ నడుపుతున్నాడు. అతనికి గుట్కా నమిలే అలవాటు ఉండడంతో సాయంత్రం వెహికల్ రన్నింగ్ లోంచి ఊంచేందుకు కిందకు వంగాడు. దీంతో అదుపు తప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో అతనిపైనుంచి లారీ వెనక టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి స్పాట్ లో చనిపోయాడు. వాటర్లారీ సమీపంలో బోల్తా పడింది. ఘటనా స్థలాన్ని సింగరేణి ఆర్జీ –1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్, ఆఫీసర్లు సందర్శించి పరిశీలించారు.