
- సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమల రావు
జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ గా నిలబెట్టాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) తిరుమల రావు అన్నారు. బుధవారం ఆయన ఎస్టీపీపీలో పర్యటించారు. అడ్మిన్ బిల్డింగ్ లో ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు, ప్లాంట్ పనితీరు, పవర్ ప్రొడక్షన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కొత్తగా నిర్మింనున్న 800 మెగా వాట్ల పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్వోటు డైరెక్టర్ రామమూర్తి, జీఎం (పీసీ ఎస్) నరసింహరావు, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ, సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీనివాస్, ఏజీఎంలు, డీజీఎంలు, కార్మిక సంఘం,ఎస్టీ, ఎస్సీ, బీసీ ఉద్యోగ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.