బొగ్గు గనుల్లో భద్రతతో పనిచేయాలి : జి.నాగేశ్వర్​రావు

బొగ్గు గనుల్లో భద్రతతో పనిచేయాలి : జి.నాగేశ్వర్​రావు

కోల్​బెల్ట్, వెలుగు : బొగ్గు గనుల్లో విధి నిర్వహణ సమయంలో భద్రతతో పనిచేయాలని సింగరేణి జనరల్​ మేనేజర్​(ఏస్వోటు- ప్రాజెక్టు, ప్లానింగ్​ డైరెక్టర్​) జి.నాగేశ్వర్​రావు, సేఫ్టీ కమిటీ కన్వీనర్ సూర్యనారాయణ రాజు సూచించారు. శుక్రవారం మందమర్రి ఏరియాలోని కాసిపేట అండర్​గ్రౌండ్​ మైన్​, రామకృష్ణాపూర్​ సింగరేణి సీహెచ్​పీలో వేర్వేరుగా నిర్వహించిన రక్షణ పక్షోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాద రహిత బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు.

డ్యూటీకి బైక్​పై  వచ్చే టైమ్​లో తప్పనిసరిగా హెల్మెట్​ వాడాలని సూచించారు. ఈ సందర్భంగా రక్షణ జెండాను ఎగురవేశారు. కార్మికులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రక్షణ కమిటీ సభ్యులతో కలిసి గని, సీహెచ్​పీలను తనిఖీ చేసి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. కాసీపేట గని సింగరేణి స్థాయిలో హాలేజీ విభాగంలో, సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్​ఓపీ) విభాగంలో మొదటి స్థానం దక్కించుకోవడంతో ట్రోఫీలను అందజేశారు.

కార్యక్రమాల్లో మందమర్రి ఏరియా ఇన్​చార్జి జీఎం ఎ.రాజేశ్వర్​రెడ్డి, కేకే గ్రూప్​ ఏజెంటు రాందాస్, ఏజీఎం(ఈఎం) నాగరాజు,  ఆర్కేపీ సీహెచ్​పీ డీజీఎం బాలాజీ భగవత్​ఝూ, కాసీపేట గని మేనేజర్​ అల్లావుద్దీన్​ ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ రవిందర్​, ఎస్​ఈ చంద్రమౌళి, డీవైఎస్​ఈ అశోక్​రెడ్డి, కాసీపేట గని సేఫ్టీ ఆఫీసర్​ సునీల్, కార్మిక సంఘాల లీడర్లు పాల్గొన్నారు.