బెల్లంపల్లిలో జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం ఎన్.రాధాకృష్ణ

బెల్లంపల్లిలో జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం ఎన్.రాధాకృష్ణ
  •   మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు : బెల్లంపల్లిలోని ఏఎంసీ గ్రౌండ్​లో ఈనెల 26న నిర్వహించే జాబ్​మేళాను నిరుద్యోగులు స్వదినియోగం చేసుకోవాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ సూచించారు. బుధవారం మందమర్రిలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సింగరేణి సీఎండీ బలరాంనాయక్​చొరవతో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ, నోబల్​ఎంపవర్​మెంట్​సంయుక్తంగా మెగా జాబ్​మేళా-–2025ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఐటీ, నాన్ ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, సర్వీస్ సెంటర్లకు చెందిన 70  ప్రముఖ సంస్థలు మేళాలో పాల్గొంటాయన్నారు. బెల్లంపల్లి, మందమర్రి పరిసర ప్రాంతాల నుంచి సుమారు​7 వేల మంది నిరుద్యోగులు మేళాకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు.

 ఎంపికైన అభ్యర్థులకు మేళాలో నియామకపత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. సమావేశంలో ఏరియా ఏస్వోటు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, ఐఈడీ ఎస్ఈ కిరణ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

డీసీపీని కలిసిన సింగరేణి జీఎం..

మంచిర్యాల డీసీపీ భాస్కర్​ను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ కలిశారు. మెగా జాబ్ మేళా--–2025  నిర్వహణ, బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో డిసెంబర్ 3న రామకృష్ణాపూర్​సింగరేణి ఓపెన్​కాస్ట్​ రెండోఫేజ్ కోసం ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీఎం డీసీపీకి వివరించారు.